అన్నారం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.

బీర్కూరు మండలం అన్నారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు బీర్కూర్ ఎస్సై రాములు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 15, 860 నగదు, ఐదు సెల్‌ఫోన్లు, రెండు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై రాములు మాట్లాడుతూ పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕