కోటగిరి నుంచి వర్ని వెళ్లే దారిలో అంబం గ్రామ సమీపంలోని స్మశాన వాటిక వద్ద మూలమలుపు ప్రమాదకరంగా మారింది. రెండు మండల కేంద్రాలకు మధ్య అతి తక్కువ సమయంలో ఈ దారి గుండా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగుస్తుండటంతో వడ్ల లారీలు ఈ దారి గుండా ఎక్కువ మొత్తంలో వెళ్తుంటాయి. ఈ కాలువపై రక్షణ దిమ్మెలు చాలావరకు శిధిలావస్థకు చేరగా కాలువపై ప్రయాణించే సమయంలో ఏమాత్రం ఆదమరిచినా పెను ప్రమాదం తప్పదు.