ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన సర్పంచ్, ఉప సర్పంచ్

నస్రుల్లాబాద్ మండలం మైలారం ప్రాథమిక ఉన్నత పాఠశాలను సర్పంచ్ బాల హరిచంద్ర రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణం భాస్కర్ శనివారం పరిశీలించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను హెడ్మాస్టర్ హనుమాన్ల ను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕