బాన్సువాడ మండల ఓబీసీ అధ్యక్షులు డాక్టర్ కొండమీది రాములు బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు మాసాని శేఖర్ రెడ్డి, మంత్రి గణేష్ మాట్లాడుతూ కొండమీది రాములు కాంగ్రెస్ పార్టీ కోసం ఎనలేని కృషి చేశారని ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం, కోనాపూర్ గ్రామంలో మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.