బాన్సువాడలో సిద్ధి వినాయక శోభాయాత్ర ఘనంగా

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సిద్ధి వినాయక వెల్ఫేర్ అండ్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వినాయకుని నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఆటపాటలు, భజనలు, సంకీర్తనల మధ్య భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, డప్పుల మోగింపు, నృత్యాలతో వీధులు సందడిగా మారాయి. ప్రతి ఏడాది ఈ శోభాయాత్రను మరింత భక్తి వైభవాలతో నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా సాగిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕