శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు బీర్కూర్‌లో స్థల పరిశీలన

కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బీర్కూర్ కమాన్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కోసం స్థల పరిశీలన శుక్రవారం చేపట్టారు. గ్రామ పెద్దలు, యువత కలిసి విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన స్థలాన్ని పరిశీలించి, ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు, యువత విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన తదుపరి చర్యలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్

✕
✕