కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని శోభాయాత్రను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆటపాటలు, భజన సంకీర్తనలు, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొని పట్టణ వీధులను ఆధ్యాత్మిక వాతావరణంతో ముంచెత్తారు. గణేశుని విగ్రహాన్ని అలంకరించిన రథంపై ఊరేగింపుగా తీసుకెళ్లుతూ భక్తులు జైగణేశ నినాదాలతో భక్తి పరవశంలో మునిగిపోయారు. శోభాయాత్ర మార్గమంతా భక్తులు పూలతో, హారతులతో స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భక్తుల సహకారంతో శోభాయాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.