గో సంరక్షణకు కఠిన చట్టం: బాన్సువాడలో గోభక్తుల భారీ నిరసన

బాన్సువాడలో గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ పిలుపు మేరకు గోభక్తులు పెద్ద ఎత్తున గుమిగూడి గో సంరక్షణకు మద్దతు తెలిపారు. గోవధ నిర్మూలనకు కఠిన చట్టం అమలు చేయాలని, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పట్టణం, మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన గోప్రేమికులు బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రాలు సమర్పించారు. ఈ వినతులను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రికి పంపాలని అధికారులను కోరారు. గో సంరక్షణ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థకు కీలకమని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్