బాన్సువాడ: పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

బాన్సువాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని బుధవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వరప్రసాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్