44డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు: వడదెబ్బకు వ్యక్తి మృతి

బాన్సువాడ పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బతో సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాన్సువాడలో సుమారు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

సంబంధిత పోస్ట్