బాన్సువాడ: డబ్బులు కాజేసిన వారిపై ఎమ్మెల్యే మౌనం వీడాలి: జుబేర్

బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆదివారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మాట్లాడుతూ కోటగిరి మండలంలో రైతులు పండించిన వరి ధాన్యానికి వచ్చిన బోనస్ డబ్బులను కాజేసిన కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్యే పోచారం మౌనం ఎందుకు వహిస్తున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్, సాయిబాబా, రమేష్ యాదవ్, శివసూరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్