కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పోచారం గ్రామంలో 40 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతున్నాయి. 1984లో గ్రామం ఏర్పడినప్పటి నుండి, గ్రామస్తుల నిర్ణయం మేరకు సర్పంచులు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. ఈసారి కూడా సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ కు కేటాయించబడగా, ఏకగ్రీవ ఎన్నికలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం అయిన పోచారంలో గ్రామస్తులందరూ ఒక తాటిపై ఉంటారని ఇది నిదర్శనం.