కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎస్.ఆర్.ఎన్.కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో నిర్వహించాలని, ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో, సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడంలో వారి పాత్ర కీలకమని సూచించారు.