సాలూర మండల కేంద్రంలో ప్రత్యేక నిఘాతో దాడి నిర్వహించి అల్ట్రాజోలం స్మగ్లింగ్ గ్యాంగ్ ను పట్టుకుని రూ. 25లక్షల విలువ గల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. బోధన్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడారు. సాలూరలో ఆల్ఫోజోలం స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారం రావడంతో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్, ఎస్సై మచ్చేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.