ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన బి మహేందర్ (34) బోధన్ సబ్ స్టేషన్ పరిధిలోని బెల్లాల్ ప్రాంతంలో అసిస్టెంట్ లైన్ మైన్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజీవ్ నగర్ తండాలో చిన్నపాటి విద్యుత్ మరమ్మతులు ఉండటంతో గురువారం అతడు ఎల్సీ (లైన్ క్లియర్) తీసుకోకుండా మరమ్మతులు చేపట్టాడు. ఈ క్రమంలో పైనున్న 11 కెవి విద్యుత్ తీగలు అతడికి తగలడంతో అక్కడి నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.