కామారెడ్డి సెగ్మెంట్ దోమకొండకు చెందిన నాగరపు అనిల్(31)తాగుడుకు బానిసై, మద్యం మత్తులో మురికి కాలువలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ స్రవంతి తెలిపారు. గురువారం ఎస్ఐ మాట్లాడుతూ తాగి జులాయిగా తిరగడంతో భార్య విడిచి వెళ్ళిందని, 11న ఇంటినుండి వెళ్ళిపోయిన అనిల్ గురువారం దోమకొండ చిన్నహనుమాన్ గుడి వెనకాల మురికి కాలువలో శవమై కనిపించాడని తెలిపారు. తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.