నవీపేట్ మండల కేంద్రంలో మేకల సంతకు వచ్చిన మినీ ట్రక్కు వాహనాన్ని దొంగలించిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు వినయ్ కుమార్ ఎస్సై శనివారం తెలిపారు. గత ఆగస్టు 31 శనివారం మేకల సంతకు వచ్చిన మినీ ట్రక్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి ఉంచగా, మహారాష్ట్రలోని హింగోలి చించొడి గ్రామానికి చెందిన తుకారం లక్ష్మణ్ పవర్ అనే యువకుడు ఎత్తుకెళ్లగా అతన్ని అరెస్టు చేశామన్నారు.