ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన సుంకరి పోచయ్య(46) శుక్రవారం నవీపేట్ మండల కేంద్రంలో జరిగిన వారంతపు సంతకు బైక్ పై తిరిగి సొంతూరికి బయలుదేరాడు. నవీపేట్ మండలంలోని అబ్బాపూర్(ఎం) శివారులో అడవి పందుల గుంపు రావడంతో అతడి బైక్ పై ఓ అడవి పందిని ఢీకొట్టింది. దీంతో అతడు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.