కామారెడ్డి జిల్లా, జుక్కల్ లోని బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా కామారెడ్డి జిల్లా కో ఇంచార్జీ రాథోడ్ సునీత పాల్గొని, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు, గర్భిణులతో సంభాషించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, పిల్లలకు అందిస్తున్న సేవలను గుర్తించి అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త, ఆయమ్మలను సన్మానించారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పత్తి రమేష్, బుడల గంగరాజు, తోట సందీప్, గోనే సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.