స్కౌట్ మాస్టర్ల ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమిషనర్ బానేష్ జాడి తెలిపిన వివరాల ప్రకారం, ఉమ్మడి జిల్లాలోని మండలాల వారీగా ది స్కౌట్/గైడ్స్ ఆర్గనైజేషన్లో పనిచేయడానికి స్కౌట్ మాస్టర్ల ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మే 2 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఏదైనా డిగ్రీ పాసై 18-30 సంవత్సరాల వయస్సు అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్