నిజాంసాగర్ ను సందర్శించిన గోదావరినది యాజమాన్య బోర్డు ఛైర్మన్

గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ పాండే, శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. 'స్వచ్ఛత హీ సేవా', 'స్పెషల్ క్యాంపెయిన్ 5.0', 'ఒక చెట్టు – అమ్మ పేరుతో' వంటి కార్యక్రమాలలో భాగంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు. ప్రాజెక్టు పరిసరాల పరిశుభ్రత, నీటి నిర్వహణ, ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెంపు వంటి అంశాలను ఆయన సమీక్షించారు. ప్రాజెక్టు అధికారులు చేపడుతున్న శుభ్రతా కార్యక్రమాలను ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్