కాంగ్రెస్ అభ్యర్థి కుమ్మరి శేఖర్ నామినేషన్ దాఖలు: అభివృద్ధి, యువత సాధికారతే లక్ష్యం

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుమ్మరి శేఖర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శేఖర్‌కు సంఘీభావం తెలిపారు. నామినేషన్ అనంతరం శేఖర్ మాట్లాడుతూ, ప్రజల అభివృద్ధి, యువత సాధికారత, పిట్లం ప్రగతే తన లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం భారీ ర్యాలీతో అభిమానులు ఆయనను తీసుకెళ్లి శోభాయాత్రగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్