నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన దళితబంధు లబ్ధిదారులు ప్రమీల, నాగమణి లకు గురువారం వాహనాలు పంపిణీ చేశారు. ఈ వాహనాలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలె మల్లికార్జున్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ ఎంపీడీవో, మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.