కాటేపల్లి లక్ష్మీదేవి గుడిలో ఏకాదశి పౌర్ణమి వేడుకలు ఘనంగా

కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో లక్ష్మీదేవి గుడి వద్ద ఏకాదశి పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కౌలాస్ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ 108 ష,బ్ర మల్లికార్జున శివాచార్య హాజరై, వర్షాలు పడి పంటలు బాగా పండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. 50 ఏళ్లుగా ఈ పూజలు జరుగుతున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటేపల్లి, సీతారాంపల్లి, అంజనీ గ్రామస్తులతో పాటు పలు గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్