శ్రీ సరస్వతి శిశు మందిర్ లో గీతా జయంతి: విద్యార్థుల శ్లోక పఠనం

శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గీతా జయంతిని పురస్కరించుకొని విద్యార్థులు భగవద్గీత శ్లోకాలు పఠించారు. పాఠశాల విద్వత్ సమితి కన్వీనర్ ఉడుగుల రాము మాట్లాడుతూ, శ్రీకృష్ణుడు 5126 ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించారని, ఇది కర్తవ్య నిర్వహణకు, జ్ఞానానికి మూలమని తెలిపారు. బాల గంగాధర్ తిలక్, కుదిరాంబోస్ వంటి ఎందరో దేశభక్తులు భగవద్గీతను ప్రేరణగా తీసుకున్నారని పేర్కొన్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచే భగవద్గీత శ్లోకాలను చదివి, అర్థం చేసుకుని, ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆచార్యులు, మాతాజీలు, ప్రధానాచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్