కామారెడ్డి జిల్లా, బాన్సువాడలో సోమవారం హిందూ సంఘాలు గోమాత గౌరవ దివస్ నిర్వహించాయి. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవధను నివారించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడలో ప్రధాన రోడ్డు వెంట ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.