పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వరం: భిక్కనూర్ సర్పంచ్ రేఖ

భిక్కనూర్ సర్పంచ్ రేఖ ఆదివారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇండ్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా, కామారెడ్డి, జుక్కల్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది.