కొలనుపాకలోని శ్రీ సోమేశ్వరాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని ఎంబురా రాచన్న దేవాలయం నుంచి జుక్కల్ నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు కొలనుపాక సోమేశ్వర ఆలయానికి పాదయాత్రగా తరలివెళ్లారు. ఎమ్మెల్యే సైతం వారితో కలిసి పాదయాత్రతో వెళ్లి సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.