ఆరోగ్యానికి రూ.3 లక్షల ఎల్బీసీ అందజేత

కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలం ఇస్రోజివాడికి చెందిన జంగం శివకుమార్ అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం కోసం రూ.3 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని ఆశ్రయించగా, ఆయన స్పందించి రూ.3 లక్షల ఎల్బీసీ మంజూరు చేయించారు. ఈ మేరకు బీజేపీ నాయకులు బాధిత కుటుంబానికి ఎల్బీసీని అందజేశారు.

సంబంధిత పోస్ట్