మల్లూరు దొర ఇకలేరు... అంత్యక్రియల్లో జుక్కల్ ఎమ్మెల్యే

నిజాంసాగర్ మాజీ జడ్పిటీసి, ఏ-1 కాంట్రాక్టర్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లూరు కృష్ణారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన నియోజకవర్గ పర్యటనను వాయిదా వేసుకున్నారు. కృష్ణారెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే హైదరాబాద్‌కు బయలుదేరారు. కృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని బంజారాహిల్స్‌లోని వారి నివాసంలో ఉంచారు.

సంబంధిత పోస్ట్