పెద్ద కొడపగల్‌లో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన

కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో మంగళవారం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద సామూహిక కుంకుమార్చన చేశారు. భాద్రపద మాసం, మంగళవారం ఏకాదశి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు శ్రీపద్రావు జోషి, సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕