మహమ్మద్ నగర్‌లోని మంజీరా పాఠశాల ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావం మరియు నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీ చేపట్టి, నీటి ప్రాముఖ్యతను మరియు వృథాను అరికట్టాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలని విద్యార్థులు సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.