పిట్లం సర్పంచ్ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ఎమ్మెల్యే

జుక్కల్ సెగ్మెంట్ పిట్లం కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి శేఖర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ర్యాలీగా తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ర్యాలీగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖల్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానుల కోలాహలం, ఉత్సాహం చూస్తుంటే ఇది నామినేషన్ లా లేదు విజయోత్సవ ర్యాలీగా కనిపిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్