సదాశివనగర్ మండలం మోడేగాంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంగ్యనాయక్, సర్పంచ్ గంగాధర్ ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారుల మోసాల బారిన పడవద్దని వారు సూచించారు.