హమర ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలి

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు చేసిన అమర ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సర్వగల రవీందర్ కోరారు. ఆదివారం పెద్ద కొడంగల్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అమర ప్రసాద్ ను అరెస్టు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే రాజ్యాంగ విలువలు పరిరక్షించబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ సెల్ చైర్మన్ సౌదాగర్ అరవింద్, జిల్లా యువసేన అధ్యక్షులు రాజు మండల అధ్యక్షుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕