ఆషాఢ వనభోజనాల్లో విద్యార్థుల సందడి

కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలం పిట్లం పాఠశాల ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులను వనభోజనాల విహారయాత్రకు తీసుకెళ్లారు. ఆషాఢ మాస వనభోజనాల విశిష్టతను, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను, ప్రకృతితో మమేకం కావాల్సిన అవసరాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రకృతి మధ్యలో ఆనందంగా వనభోజనాలు ఆస్వాదించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్