అంగన్‌వాడీ సిబ్బంది సేవలు అభినందనీయం

కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలం లాడేగావ్ గ్రామంలోని ఎస్సీ వాడ, ప్రైమరీ స్కూల్ అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్ మిలన్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ మహిళా మోర్చా కో-ఇన్‌చార్జి రాథోడ్ సునీత అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను సన్మానించి, వారి సేవలను ప్రశంసించారు. అనంతరం విద్యార్థులు, గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ పటేల్, బుడాల గంగరాజు, సంబాజీ పటేల్, గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕