రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులో మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను నిజాంసాగర్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎస్ఐ శివకుమార్ కథనం మేరకు, ఒడ్డేపల్లి గ్రామానికి ఇసుకను తరలిస్తున్న సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, రెవిన్యూ శాఖకు అప్పగించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్