జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, స్థానిక మండల నాయకులతో కలిసి మద్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా ఉషా సంతోష్ మేస్త్రిని ఎంపిక చేశారు. మద్నూర్ గ్రామ ప్రజలు ఉషా సంతోష్ మేస్త్రిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉషా గెలుపుకు కృషి చేయాలని సూచించారు.