రాజ్ భవన్లో జరిగిన మొహమ్మద్ అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి విశేషమైన సేవలు అందించారని, క్రీడలలోనే కాదు, ప్రజాసేవలోనూ ఆయనకు విశేషమైన అనుభవం ఉందని అన్నారు. ఆయన మంత్రిగా నియమించబడడం రాష్ట్రానికి మేలుచేసే నిర్ణయమని, పార్టీ బలోపేతానికి, యువతకు స్ఫూర్తిగా నిలుస్తారని తెలిపారు.