కామారెడ్డి: పెళ్లి వేడుకలో నగదు, నగలు మాయం!

రాజంపేటలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్‌లో బుధవారం జరిగిన వివాహ వేడుకలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. బంధుమిత్రుల సందడి మధ్య జరిగిన ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనతో పెళ్లి బృందం షాక్‌కు గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్