బీబీపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

బీబీపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, రజక సంఘం సభ్యులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ ప్రశాంత్, ఐలమ్మ భూసాయిదా పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సద్విక, ఉపసర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ కుమార్, పాలకవర్గ సభ్యులు, రజక సంఘం అధ్యక్షులు, సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕