కామారెడ్డిలో ఇందిరా గాంధీ విగ్రహంపై దాడి

కామారెడ్డిలో ఓ యువకుడు ఇందిరా గాంధీ విగ్రహంపై దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అసంతృప్తితోనే నిందితుడు ఈ చర్యకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేయాలి కానీ విగ్రహాలపై దాడులు చేయడం సరైనది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడితో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕