గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయపాల్ రెడ్డి బుధవారం పాల్వంచ, మాచారెడ్డి మండలాల్లోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో పర్యటించారు. లబ్ధిదారులను, కమిటీ సభ్యులను ప్రోత్సహించి, నిర్మాణంలో ఉన్న ఇళ్లపై అవగాహన కల్పించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.