కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో బుధవారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట మండలాల్లో పర్యటన కొనసాగనుంది. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. అలాగే డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి నిర్వహించే డ్రా కార్యక్రమాల్లో పాల్గొంటారు.