నిజామాబాద్: ఏవో ప్రవీణ్ కుటుంబ సభ్యుల ధర్నా

నిజామాబాద్ ధర్పల్లి వ్యవసాయధికారి ప్రవీణ్ కుటుంబంకు అందాల్సిన బెనిఫిట్స్ అందకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏవో ప్రవీణ్ కుటుంబ సభ్యులు నిజామాబాద్ రూరల్ ఏడీఏ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేశారు. ప్రవీణ్ మృతి చెందిన బాధలో తాముంటే తమను ఇంకా వేధిస్తున్నారని మృతుడి భార్య, పిల్లలు కన్నీటి పర్వంతమయ్యారు. అధికారులు జోక్యం చేసుకుని రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్