అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి వేధిస్తున్నారని నిజామాబాద్ కు చెందిన తాండ్ర లక్ష్మణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కల్వారె గంగాధర్ పై నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన ఓ మహిళకు రూ. 8 లక్షలు అధిక వడ్డీకి ఇచ్చి, బలవంతంగా ఆమె పేరుపై ఉన్న ఓపెన్ ప్లాట్ ను అతని పేరున సేల్ డీడీ చేయించుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో రూరల్ ఠాణా పోలీసులు పలు సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు.