నాగపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి

డిచ్ పల్లి మండల కేంద్రంలోని నాగపూర్ గేట్ సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి హర్యానా వైపు వెళ్తున్న కంటైనర్ నాగపూర్ గేట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ లో ప్రయాణిస్తున్న క్లీనర్ మృతి చెందగా డ్రైవర్ కు గాయాలయ్యాయి. గాయాల పాలైన కంటైనర్ డ్రైవర్ ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్