నిజామాబాద్‌లో ఈ నెల 13న ఊర పండుగను నిర్వహిస్తున్నారని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. ఏటా ఆషాడమాసంలో నిర్వహించే ఈ పండుగకు మామిడి చెట్టు నుంచి తీసుకువచ్చిన కర్రతో అమ్మవారి విగ్రహాల తయారీకి 5 రోజుల పాటు నిష్టతో ఉండి 13 ప్రతిమలు తయారు చేస్తామని వడ్రంగులు తెలిపారు. దాదాపు 80 ఏళ్ల నుంచి 3 తరాలుగా ఈ ఆచారం వస్తుందన్నారు.