నిజామాబాద్: పోలీసులకు పట్టించారని ఇటుక, కర్రలతో దాడి

పోలీసులకు పట్టించారంటూ యూత్ సభ్యులపై దాడి చేసిన వ్యక్తులను రిమాండ్ కు తరలించినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ చెందిన షేక్ అబ్దుల్ గఫార్, అతని మిత్రులు షేక్ అవేజ్, మహేశ్, సచిన్ కలిసి బుధవారం రాత్రి యూత్ సభ్యులపై ఇటుకలు, కర్రలతో దాడి చేశారన్నారు. గఫార్ గత నెలలో గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడడంతో గౌతమ్ నగర్ చెందిన వారే పోలీసులకు పట్టించారనే అను మానంతో యూత్ సభ్యులపై కక్షతో దాడి చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్